మీరు తరచూ ఆఫీసు పనిమీద విమానాల్లో ప్రయాణం చేస్తున్నారా.. ఇందులో భాగంగా ల్యాపీని కూడా విమానంలో తీసుకువెళుతున్నారా.. అయితే ఇకపై మీరు జాగ్రత్తపడాల్సిందే. మీ దగ్గర 15 అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో ల్యాప్‌టాప్ ఉంటే ఫ్లైట్ ఇకపై ఎక్కనివ్వరు. పదిహేను అంగుళాల ఆపిల్ మ్యాక్ బుక్ ప్రో ల్యాప్‌టాప్‌లను విమానాల్లోకి తీసుకురావొద్దని భారత వైమానిక రంగ నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విమాన ప్రయాణికులకు సూచించింది.
ప్రయాణికులు ఎవరూ 15 అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో ల్యాప్‌టాప్ తీసుకురావొద్దని కోరింది. 15 అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో ల్యాప్‌టాప్‌లోని బ్యాటరీ ఓవర్ హీట్ అవుతుండటంతో సేఫ్టీ రిస్క్ ఉంటుందని ఇటీవల ఆపిల్ గుర్తించిన సంగతి తెలిసిందే. సదరు ల్యాప్‌టాప్‌లలోని బ్యాటరీలు వేడెక్కుతుండటం వల్ల ప్రమాదాలు జరుగవచ్చనే సందేహాలతో ఈ నిర్ణయం తీసుకున్నది. సెప్టెంబర్ 2015-ఫిబ్రవరి 2017మధ్య ఉత్పత్తిచేసిన మ్యాక్‌బుక్ ప్రో ల్యాప్‌టాప్‌లలో అమర్చిన బ్యాటరీలు పేలే ప్రమాదం ఉన్నదని, ఉచితంగా మరమ్మతులు చేస్తామని కూడా ప్రకటించింది.
ఈ క్రమంలో డీజీసీఏ అధిపతి అరుణ్‌కుమార్ విమాన ప్రయాణికులకు పలు విజ్ఞప్తులు చేశారు. సెప్టెంబర్ 2015-ఫిబ్రవరి 2017మధ్యలో ఉత్పత్తి చేసిన మ్యాక్ బుక్ ప్రో ల్యాప్‌టాప్‌లలో బ్యాటరీ వేడెక్కడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నట్టు ఆపిల్ ప్రకటించింది. కావున విమాన ప్రయాణికులు మ్యాక్‌బుక్ ప్రో పాతవెర్షన్లను చెక్ ఇన్ లగేజీలో, హ్యాండ్ లగేజీలో తీసుకురావొద్దని అభ్యర్థిస్తున్నాం అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు.
అమెరికాలోని ఫెడరల్ ఏవియేషన్ అడ్మిన్‌స్ట్రేషన్ కూడా వీటిని విమానాల్లోకి తేవడంపై నిషేధం విధించింది. ఇటీవల ఆపిల్ లెక్కల ప్రకారం 26 కేసుల్లో ఆపిల్ మ్యాక్‌బుక్ ప్రో విపరీతంగా వేడెక్కినట్లు తేలింది. వీటిల్లో ఐదుగురు వినియోగదారులకు స్వల్పగాయాలు కావడంతో పాటు, పొగ వెలువడటం వంటి ఘటనలు చోటు చేసుకొన్నాయి. అమెరికాలో 4,32,000లు, కెనడాలో 26,000 ల్యాపీలు విక్రయించారు.
à°®à±à°¯à°¾à°•à±â€Œà°¬à±à°•à± à°ªà±à°°à±‹ à°²à±à°¯à°¾à°ªà±â€Œà°Ÿà°¾à°ªà± ఆపిలౠమà±à°¯à°¾à°•à± à°¬à±à°•à± à°ªà±à°°à±‹ à°à°¾à°°à°¤ వైమానిక à°°à°‚à°— నియంతà±à°°à°£ సంసà±à°¥ డీజీసీఠడైరెకà±à°Ÿà°°à±‡à°Ÿà± జనరలౠఆఫౠసివిలౠà°à°µà°¿à°¯à±‡à°·à°¨à±